తాడిపత్రి పట్టణంలోని జూనియర్ కళాశాల విద్యార్థులకు బుధవారం నుంచి స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ తెలిపారు. విధ్యార్థుల ఉత్తమ ఫలితాలకు గాను ప్రభుత్వ ఆదేశాల మేరకు రోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, హాస్టల్ వార్డెన్లు గమనించాలని కోరారు.