తాడిపత్రి పట్టణ సమీపంలోని అనంతపురం బైసాస్ రోడ్డులో పనులు చేస్తున్న మెగా కంపెనీకి చెందిన కార్మికుడిపై దాడి చేశారని రూరల్ అప్ గ్రేడ్ సీఐ శివగంగాధర్ రెడ్డి గురువారం తెలిపారు. రోడ్డు పనులు చేస్తున్న ఆయనపై బైక్ లో నలుగురు వ్యక్తులు వచ్చి దాడి చేశారన్నారు. అతడి నుంచి సెల్ ఫోన్ తీసుకెళ్లారన్నారు. గాయపడిన బాధితుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.