తాడిపత్రి: శివాలయానికి వెండి గంట వితరణ

84చూసినవారు
తాడిపత్రి: శివాలయానికి వెండి గంట వితరణ
తాడిపత్రి పట్టణ సమీపంలోని పెన్నానది తీరాన వెలసిన శ్రీబుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయానికి తాడిపత్రికి చెందిన రవీంద్రారెడ్డి అనే భక్తుడు వెండి గంటను బుధవారం అందచేశారు. కోమలి రవీంద్రారెడ్డి ఆయన సతీమణి మహేశ్వరిలు ప్రత్యేక పూజలు నిర్వహించి 1 కిలో 377 గ్రాముల వెండి గంటను ఆలయ అర్చకులు శంకరయ్యశర్మ, గిరిశర్మ, రవిశర్మలకు అందచేశారు. అనంతరం అర్చకులు వారికి వేదమంత్రోచ్చారణల నడుమ ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందచేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్