తాడిపత్రి మండలం రావివెంకటాంపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు పెద్దపప్పూరు మండలంలోని సోమనపల్లికి చెందిన నాగరంగయ్య సొంత పనిమీద తాడిపత్రికి బయలుదేరాడు. రావి వెంకటాపల్లి గ్రామం వద్దకు రాగానే ఓ ప్రైవేట బస్సు ఢీకొంది.