తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లి లో ఆరుగురిని అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి శనివారంతెలిపారు. గతేడాది జూలైలో గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి, రాజమోహన్ రెడ్డి, అశోక్ రెడ్డిలతో పాటు మరికొంతమంది ఇంటి వద్ద గోడ విషయంలో కతాలప్పతో గొడవపడ్డారు. ఈ ఘర్షణలో కతాలప్ప గాయపడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అందుకు సంబంధించి శనివారం ఆరుగురిని అరెస్టు చేశామని సీఐ చెప్పారు.