ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తాడిపత్రి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య మాట్లాడుతూ.. స్థానిక పెన్నానది నుంచి నిత్యం ఇసుక అక్రమంగా తరలిపోతోందన్నారు. దీనిని అరికట్టకపోతే భూగర్భజలాలు అడుగంటే ప్రమాదం ఉందన్నారు. ప్రజలకు తాగడానికి నీరు కూడా దొరకదన్నారు. కనుక అక్రమ రవాణాను అరికట్టాలని కోరారు.