ఆడపిల్లే ఇంటికి వెలుగు

62చూసినవారు
ఆడపిల్లే ఇంటికి వెలుగు
ఆడపిల్లే ఇంటికి వెలుగని తాడిపత్రి ఐసీడీఎస్ సీడీపీఓ సాజితా బేగం పేర్కొన్నారు. బుధవారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా నారాపురం, చాగల్లు గ్రామాల్లోని అంగన్ వాడీ సెంటర్లలో గర్భిణులు, తల్లులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో ఆడపిల్లల శాతం తక్కువగా ఉందన్నారు. ఎక్కువ మంది మగపిల్లలే కావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రస్తుతం సగటున 1000మందికి 937మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారన్నారు.

సంబంధిత పోస్ట్