యాడికిలో కన్న తండ్రిని చంపిన కొడుకు

65చూసినవారు
యాడికిలో కన్న తండ్రిని చంపిన కొడుకు
యాడికిలో బుధవారం దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆస్తి తగాదా విషయపై కన్న కొడుకే తండ్రిని హత మార్చినట్లు సీఐ ఈరన్న బుధవారం తెలిపారు. మండలంలోని ఈరన్నపల్లికి చెందిన మృతుడు లక్ష్మీనారాయణతో మొదటి భార్య కొడుకు కార్తీక్ గొడవ పెట్టుకుని కత్తితో పొడిచి, రాళ్లతో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. రెండవ భార్య రమాదేవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్