విద్యా కానుకల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించండి

81చూసినవారు
విద్యా కానుకల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించండి
ఉరవకొండ మండలంలో విద్యా కానుకల పంపిణీలో అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని ఐక్య విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేస్తూ.. సోమవారం జరిగిన సమస్యల పరిష్కార వేదికలో తాసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆర్ఎస్ వై ఎఫ్ జిల్లా కార్యదర్శి భీమేష్, పి భాస్కర్, సెక్షన్ పల్లి భాస్కర్, చికాలాగురికి రామాంజనేయులు మాట్లాడుతూ.. విద్యా కానుకలను ఆయా పాఠశాలలకు చేరవేయాల్సిన మండల విద్యాధికారి చోద్యం చూశారన్నారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను మండల వనరుల కేంద్రానికి రప్పించుకొని పంపిణీ చేయడం ఏమిటని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్