ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఎన్నిక

1460చూసినవారు
ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఎన్నిక
ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ మరియు వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూర్ మహమ్మద్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి నార్పల వెంకట సాయినాథ్ హిందూపురం నియోజకవర్గ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ మరియు వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ గా బీరప్ప గారి ఆంజనేయులు, సెక్రటరీ పి.చంద్రశేఖర్, కో కన్వీనర్ అశోక్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఆంజనేయులు గారు ప్రైవేట్ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని వారి సమస్యలను నా‌ సమస్యగా భావిస్తామనని తెలియజేశారు.అలాగే పి.చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్నా బోధన, బోధనేతర సిబ్బందికి లాక్డౌన్ కి సంబంధించిన వేతనాలను ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు చెల్లించాలని, ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వీరితో పాటు అశోక్ కుమార్ లు మరియు ప్రైవేటు టీచర్లు పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది. వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి జిల్లా ప్రధాన కార్యదర్శి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్