జగన్ హిందూ వ్యతిరేకి అని ముద్ర వేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తిరుపతి లడ్డూలో అనిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పటం దుర్మార్గం అన్నారు. కోట్లాది మంది వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బ తీశారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తిరుపతి బ్రాండ్ ఇమేజ్ ను సీఎం చంద్రబాబు దెబ్బతీశారని విమర్శించారు.