ముగిసిన హర్యాలీ తీజ్ ఉత్సవాలు

77చూసినవారు
వజ్రకరూరు మండలంలోని రూపా నాయక్ తండాలో హర్యాలీ తీజ్ ఉత్సవాలు ముగిశాయి. ఈనెల 16న ప్రారంభమైన ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో గిరిజనులు నిర్వహించారు. చివరి రోజు వేడుకలకు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి బంజారాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సంత్ సేవాలాల్ మహారాజ్, సామ సంగ్ మహారాజ్, తుల్జా భవాని తదితర ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్