గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం

54చూసినవారు
గొడవలు, అల్లర్లకు దిగితే ఎవర్నీ ఉపేక్షించకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గౌతమిశాలి పోలీసులను ఆదేశించారు. ఉరవకొండ పట్టణంలో పర్యటించి తాజా పరిస్థితులపై ఎస్పీ ఆరా తీశారు. పట్టణంలోని క్లాక్ టవర్, పాతపేట, గాంధీబజార్, తదితర ప్రాంతాల్లో తిరిగారు. సమస్యాత్మక కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిరంతరం మొబైల్ పార్టీల పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్