అందుకే కంగనాను కొట్టాను: CISF కానిస్టేబుల్ (Video)

56చూసినవారు
నటి, బీజేపీ నేత కంగనా రనౌత్‌ను గురువారం చండీగడ్ విమానాశ్రయంలో CISF మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టిన సంఘటన కలకలం సృష్టించింది. అయితే అలా కొట్టడానికి గల కారణాన్ని కుల్విందర్ కౌర్ చెబుతున్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ‘రైతులు రూ.100 కోసం నిరసన చేస్తున్నారని కంగనా అన్నారు. ఆమె అలా వెళ్తుందా? ఆ నిరసనకారుల్లో నా తల్లి కూడా ఉన్నారు’ అని తెలిపారు. కాగా కౌర్‌ను సస్పెండ్ చేసిన CISF చండీగఢ్‌లోని స్థానిక పీఎస్‌లో ఆమెపై ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్