లోక్‌సభ ఎన్నికల్లో విజేతల జాబితాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎలక్షన్ కమిషన్ గురువారం సమర్పించింది. రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం 4:30 గంటలకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు ఈ జాబితాను రాష్ట్రపతికి అందజేశారు. ’ సెక్షన్ 73 ప్రకారం రాష్ట్రపతికి సమర్పించారు’ అని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.