ఉరవకొండ పట్టణంలో అపార్ సెంటర్స్ పెంచాలని కోరుతూ ఎమ్మార్వోకి శుక్రవారం టీ.ఎన్.ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో నాయకులు బాణాల రాజశేఖర్ విన్నవించారు. అపార్ కార్డుల విషయంలో, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తహసీల్దార్ దృష్టికి ఆయన తెచ్చారు. విద్యార్థుల, తల్లిదండ్రుల పేరు మార్పు, డేట్ అఫ్ బర్త్ తదితర విషయాల యందు ఆధార్ క్యాంపుల సెంటర్లను పెంచాలని అలాగే జూనియర్ కళాశాలలో అదనపు సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని రాజశేఖర్ ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.