ఉరవకొండ పట్టణంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నందు జనరల్ బాడీ సమావేశం అనంతరం ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శిగా హరుణ్ రసీద్ మండల అధ్యక్షులుగా నందుని ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ నిరంతరం పని చేస్తుందన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.