ఉరవకొండ మార్కెట్ యార్డ్ నందు కందులను వెంటనే కొనుగోలు చేయాలని రైతులందరినీ కలిసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత నెల రోజుల క్రితం రైతుల పంట చేతికి వచ్చినా ఇప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటనలకే పరిమితమైంది. కావున ఇప్పటికే రైతాంగమంతా తీవ్రంగా నష్టాల్లో ఉన్నందున వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సోమవారం సిపిఎం రైతు సంఘం డిమాండ్ చేశారు.