ఉరవకొండ: జలకల సంతరించుకున్న మరుట్ల గ్రామా చెరువు

58చూసినవారు
ఉరవకొండ: జలకల సంతరించుకున్న మరుట్ల గ్రామా చెరువు
కూడేరు మండలం మరుట్ల గ్రామానికి చెందిన చెరువు జలకల సంతరించుకుంది. పీఏబీఆర్ రిజర్వాయర్ కుడి కాలువకు నీరు విడుదల చేయడంతో మరుట్ల - 1వ పరిధిలో ఉన్న చెరువుకు తుంగభద్ర జలాలు చేరి నీటి కుండలా మారింది. సోమవారం చెరువు మరువ పారడంతో పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ చెరువు కింద 3 గ్రామాల పరిధిలోని 100 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. బోరు బావుల్లో పుష్కలంగా నీరు లభిస్తుందని రైతులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్