బెళుగుప్ప మండలం దుద్దెకుంట గ్రామం నందు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం ఆర్డీవో వసంత కుమార్ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ తమ సమస్యలను తెలియజేస్తూ, వాటి పరిస్కారం దిశగా కార్యక్రమంను సక్రమంగా వినియోగించుకోవాలని తెలియజేశారు. ప్రజల నుండి భూ మరియు ఇతర సమస్యల పై అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో బెళుగుప్ప తహసీల్దార్, గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ సర్వేయర్ పాల్గొన్నారు.