ఉరవకొండలో ఉన్నటువంటి షిర్డీ సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా బాబాకి ఉదయం నుంచి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, కాకడ హారతి, అష్టోత్తర కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, రాత్రికి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో బాబా వారి ఫొటోను, పాదుకలు ఉంచి పల్లకిసేవ నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.