బద్వేల్: వ్యక్తి మృతి.. ఆసుపత్రి క్లోజ్

77చూసినవారు
బద్వేల్: వ్యక్తి మృతి.. ఆసుపత్రి క్లోజ్
కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రామాయపల్లెకు చెందిన కారు రమణయ్య ఇంజక్షన్ వికటించి మృతి చెందిన విషయం తెలిసింది. ఈ ఘటనపై జిల్లా ఉప ఆరోగ్య వైద్యాధికారి మల్లేష్ సోమవారం విచారణ చేపట్టారు. సంబంధిత ప్రైవేట్ ఆసుపత్రిని క్లోజ్ చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదైందని పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎస్ఐ కొండారెడ్డి ఆయన వెంట ఉన్నారు.

సంబంధిత పోస్ట్