బద్వేల్: హత్యాయత్నానికిగురైన యువతిని పరామర్శించిన ఎమ్మెల్యే

81చూసినవారు
బద్వేల్: హత్యాయత్నానికిగురైన యువతిని పరామర్శించిన ఎమ్మెల్యే
బద్వేలులో హత్యాయత్నానికి గురైన యువతిని శనివారం సాయంత్రం బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా పరామర్శించారు. రిమ్స్ లో చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్యంపై బంధువులతో పాటు డాక్టర్లను ఎమ్మెల్యే డాక్టర్ సుధా అడిగి తెలుసుకున్నారు. గాయపడిన యువతికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆమె కోరారు. త్వరగా ఆరోగ్యం కుదుట పడుతుందని వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించారు.

సంబంధిత పోస్ట్