బద్వేలు: ఆర్టీసీ బస్టాండ్ లో వీధి కుక్కల స్వైర విహారం

82చూసినవారు
బద్వేలు: ఆర్టీసీ బస్టాండ్ లో వీధి కుక్కల స్వైర విహారం
బద్వేలు పట్టణ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి గుంపులు గుంపులుగా కుక్కలు బస్టాండు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయని తెలిపారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు కుక్కల బెడద తప్పడం లేదని అన్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి కుక్కలను రాకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్