జీడి నెల్లూరు: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి
వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని శనివారం జీడి నెల్లూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న మండలాలలో, ఎంపీడీవో కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, తహసిల్దార్ కార్యాలయాలలో జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా వినతి పత్రం అందజేసారు. తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియచేయాలని విలేకరులు కోరారు. అనంతరం జర్నలిస్టులు రోగులకు పండ్లు పంచిపెట్టారు.