మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితర నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గురువారం గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్ పొన్నా యుగంధర్ అన్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేయాలని కార్వేటి నగరం సీఐ హనుమంతప్పకు యుగంధర్, జనసేన పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.