ముద్దనూరు: ఆటో బోల్తా.. యువకునికి గాయాలు

68చూసినవారు
ముద్దనూరు: ఆటో బోల్తా.. యువకునికి గాయాలు
ముద్దనూరు మండల పరిధిలోని చింతకుంట గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో చింతకుంట గ్రామానికి చెందిన ఆరవీటి శ్రీనివాసులు (21) కుడి కాలు విరిగి, తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం యువ కూలీలు ముగ్గురు, ఆటో డ్రైవర్తోపాటు ఎరువుల బస్తాలను దించడానికి వెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రుని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్