ముద్దనూరు: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

77చూసినవారు
ముద్దనూరు: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపిటిసి వెన్నపూస లక్ష్మీ కాంతమ్మ పేర్కొన్నారు. ముద్దనూరు మేజర్ గ్రామ పంచాయతీలో గురువారం ఎంపిడిఒ ముకుందరెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా మేజర్ గ్రామ పంచాయతీలో రూ. 92. 50లక్షలు వ్యయంతో సిసి రోడ్లు, పాఠశాల ప్రహారీ నిర్మాణానికి ఎంపిటిసి, జడ్పిటిసి సభ్యులు బడుగు ఉమాదేవి భూమిపూజ చేశారు.

సంబంధిత పోస్ట్