ఒంటిగారి పల్లె లో పొలం పిలుస్తోంది కార్యక్రమం

76చూసినవారు
ఒంటిగారి పల్లె లో పొలం పిలుస్తోంది కార్యక్రమం
ముద్దనూరు మండలం ఒంటిగారిపల్లెలో గురువారం వ్యవసాయ అధికారులు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి వెంకట కృష్ణారెడ్డి గ్రామంలో సాగు చేసిన ప్రత్తి, ఉల్లి పంటలను పరిశీలించి రైతులకు తగు సూచనలు ఇచ్చారు. ప్రత్తి పంటలో రసం పీల్చే పురుగుల నివారణకు పసుపు రంగు జిగురు అట్టలు పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుందని తెలిపారు.మోనో క్రోటో పాస్ 1. 6 యమ్ యల్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్