మెప్మాలోని రిసోర్స్ పర్సన్ లకు వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారని.. ప్రభుత్వం ఇస్తున్న అరకొర వేతనాలతో కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చుకోలేక అవస్థల పాలవుతున్నారని తక్షణమే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ బాదుల్లా డిమాండ్ చేశారు. గురువారం కడప నగరంలోని హోచిమిన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాదుల్లా మాట్లాడుతూ జీతాలు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు.