కడప నగరంలోని బిల్టప్ సమీపంలోని విజయ దుర్గాదేవి ఆలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు మల్లికార్జునరావు, నిర్వాహకులు దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు, భక్తులు కలశాలతో పవిత్రనదీ జలాలను తీసుకొచ్చి అమ్మ వారికి అభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అనంతరం ఆలయ యాగశాలలో గణపతి, విజయదుర్గ, చండీహోమం జరిపారు. వేద పండితులు సుబ్బరాయశర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.