కడప జిల్లా విద్యాశాఖ అధికారిగా యు. మీనాక్షి నియామకమయ్యారు. గురువారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం డిప్యూటీ డిఈఓగా పనిచేస్తున్న మీనాక్షిని, ప్రొద్దుటూరు డిప్యూటీ డిఈఓగా బదిలీ చేస్తూ అదనపు బాధ్యతలు కింద కడప జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమించారు. ప్రస్తుతం కడప డిఈఓగా పనిచేస్తున్న అనురాధను ప్రభుత్వానికి రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు.