వినాయక చవితి నిమజ్జనం అనంతరం కడపలో రామరాజు పల్లె నిమజ్జనం కాల్వ వద్ద ఎబివిపి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించబడింది. యోగి వేమన విశ్వవిద్యాలయ విద్యార్థులు,సభ్యులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాల్వ పరిసరాలను శుభ్రపరచి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సందేశాలను విస్తృతంగా ప్రచారం చేశారు.