దేశంలో విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్న మనమంతా ఒక్కటే అని వైవీయూ విసి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. యోగి వేమన యూనివర్సిటీ ప్రాంగణంలో భారత ప్రభుత్వ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమాన్ని గురువారం విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు. అనంతరం వీసీ ప్రసంగిస్తూ విశాఖపట్నానికి చెందిన యువత కడప జిల్లా చరిత్రను, విశిష్టతను తెలుసుకునేందుకు ఇక్కడికి రావడం అభినందనీయమన్నారు.