చెన్నూరు మండల కేంద్రంలోని 14 వ వార్డు అరుంధతి నగర్ లో రోడ్డుపై బురద నీరు నిలిచి ఉండడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రోడ్డుపై బురద నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బురదనీరు నిలువ ఉండి వ్యాధులు ప్రభలక ముందే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.