విద్యార్థులకు ఎప్పటికప్పుడు సరికొత్త విధానంలో విద్య బోధనను అందించడమే కాకుండా విద్యార్థులకు వాటిలోని అర్థాలను మెలకువలను అర్థమయ్యే విధంగా బోధించాలని సర్వ శిక్ష అభియాన్ సీఎంఓ కేశవరెడ్డి అన్నారు. మంగళవారం చెన్నూరు మండలంలోని రామనపల్లె జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటుచేసిన ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.