100 మంది రైతులకు 90 శాంతం సబ్సిడీతో డ్రిప్పులు, 55 % సబ్సిడీతో స్పింక్లర్స్ ను కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి పంపిణీ చేశారు. శుక్రవారం కమలాపురం అగ్రికల్చర్ కార్యాలయం వద్ద నియోజకవర్గ స్థాయిలో 100 మంది రైతులకు సబ్సిడీ డ్రిప్పులు, స్పింక్లర్స్ ను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు.