కొప్పర్తి ఇండస్ట్రీ కారిడార్ అభివృద్ధికి ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, చంద్రబాబు నాయుడు సహకారముతో కేంద్ర ప్రభుత్వం నుండి రూ.2వేల కోట్లు కేటాయించేలా చేయడం జరిగిందని కడప జిల్లా టీడీపి మైనారిటీ అధ్యక్షుడు ఖాదర్ బాషా అన్నారు. ఆదివారం కమలాపురం టిడిపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా రవీంద్రనాథ్ రెడ్డి ఒక్క అభివృద్ధి పని అయినా చేయకపోగా విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు.