ప్రత్యక్ష అనుభవం ద్వారా ఆచరణాత్మక జ్ఞానాన్ని పొందవచ్చని యోగి వేమన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సిలర్ కె. కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం పెండ్లిమర్రి మండలంలోని వైవీయూలో ఎంబీఏ విద్యార్థులు ఇండస్ట్రియల్ విజిట్ కార్యక్రమాన్ని విసి కృష్ణారెడ్డి ప్రారంభించారు. మేనేజ్మెంట్ నిర్వహణతో పాటు కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉన్నవారు దేశ విదేశాల్లో రాణిస్తారని ఆ దిశగా తయారు కావాలని ఆయన విదార్థులకు సూచించారు.