మదనపల్లె తాలుకా సీఐగా కళా వెంకట రమణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో సీఐగా పనిచేసిన ఎన్. శేఖర్ రాయచోటికి బదిలీ అయ్యారు. నాలుగు రోజుల క్రితం కర్నూలు రేంజ్ డీఐజీ డా. కోయ ప్రవీణ్ కుమార్ సీఐల బదిలీలు, నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ క్రమంలో నూతన సీఐగా తిరుపతి ట్రాఫిక్ లో పనిచేస్తున్న వెంకట రమణ బాధ్యతలు స్వీకరించారు.