ఒక్క అడుగు కబ్జాచేసినా తోలు తీస్తా

70చూసినవారు
ఒక్క అడుగు కబ్జాచేసిన తోలు తీస్తానని ఎమ్మెల్యే షాజహాన్ భాషా తెలిపారు. బుధవారం మదనపల్లెలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తానన్నారు. పట్టణంలో గంజాయి, భూదందాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. భూకబ్జాలకు పాల్పడేవారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. పార్టీలకతీతంగా తన దగ్గరికి వచ్చి న్యాయం కోరితే అండగా ఉంటానన్నారు. గెలిపించిన వారికీ కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్