మైదుకూరు పట్టణానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు బిపి ప్రతాప్ రెడ్డి.. మంగళవారం రవాణాశాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డిని అన్నమయ్య జిల్లా సంబెపల్లిలో మార్యదపూర్వకంగా కలిసారు. మైదుకూరు ఆర్టిసి బస్టాండ్ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎ.నారయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.