పీలేరు గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టరు ఆదేశాలతో 20 రోజులపాటు విచారణ జరిపి నివేదికను కలెక్టరుకు అందజేశారు. అనంతరం కలెక్టరు ఆదేశాల మేరకు మంగళవారం పీలేరులో ఎంపిడిఓ ఉపేంద్ర రెడ్డి, ఇన్చార్జి ఈఓ గురుమొహాన్ మీడియాకు నివేదిక సారాంశాన్ని తెలియజేస్తూ రూ. 1. 40, 43, 714లు నిధులు దుర్వినియోగం అయినట్లు చెప్పారు.