వాల్మీకిపురం స్థానిక పి.వి.సి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో.. చిత్తూరు 35వ ఆంధ్రా బెటాలియన్ ఎన్.సి.సి. వారి ఆధ్వర్యంలో ప్రపంచ సముద్రయాన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంచార్జి హెచ్.ఎం. వెంకట రమణప్ప మాట్లాడుతూ.. భారతదేశం ద్వీపకల్ప దేశమని, సముద్రతీర ప్రాంతం ఎక్కువగా ఉందని, మన నౌకాదళం ప్రపంచంలో ఉత్తమంగా ఉందని అన్నారు. ఎన్నో యుద్ధాలలో శత్రుదేశాల బలగాలను త్రిప్పి కొట్టిందని, దేశరక్షణ వ్యవస్థలో నౌకాదళం కీలకంగా ఉందని అన్నారు.