ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని స్థలం ఆక్రమించి అక్రమ కట్టడాల నిర్మిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున వెల్లడించారు. బుధవారం ఉదయం స్థానిక పురపాలక సంఘ కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న స్థలాన్ని కొందరు ఆక్రమించారు. అనధికారంగా రూములు నిర్మించిన వాటిని ఆయన పోలీసుల సమక్షంలో తొలగించారు.