ప్రొద్దుటూరు మండలం రామాపురంలో పెన్నా నది నుంచి అక్రమ ఇసుక తరలింపు విషయంలో బుధవారం టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు కారణం ఇసుకను తన భూమిలో అక్రమంగా తవ్వుతున్నారని ఒక వర్గం ఆరోపించింది. దీంతో టీడీపీలోనే రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడ్డారు. ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డి ఘర్షణానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు.