వేంపల్లిలో ఉన్న మండల వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఇడుపులపాయ గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. మండలంలోని వరి ధాన్యాన్ని బయట మార్కెట్లో తక్కువ అడుగుతుంటే ఎమ్ ఎస్ పీ కింద ప్రభుత్వం కనీసం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు.