పులివెందుల పట్టణంలోని విజయ హోమ్స్ లో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. స్థానికులు వివరాల మేరకు హెచ్. పీ గ్యాస్ హరినాథ్ రెడ్డి ఇంటిలో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఆదివారం సమాచారం అందుకున్న డి. ఎస్. పి మురళి నాయక్, సీఐలు, ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.