ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తెలిపారు. పులివెందులలోని ఆయన నివాసంలో సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను త్వరితగతిన విచారించి ప్రజలకు న్యాయం చేయాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయరాదని కోరారు.