పులివెందుల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదివారం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈ 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం ప్రజలకు ఇది ఒక హక్కు అని పేర్కొన్నారు. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.